రామకృష్ణాపూర్‌లో వైభవంగా వాసవీ జయంతి
రామకృష్ణాపూర్‌లో వైభవంగా వాసవీ జయంతి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆలయ నిర్మాణానికి సహకరించాలని మంత్రికి విన్నపం కాకతీయ, రామకృష్ణాపూర్: పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వాసవీ మాత కన్యాకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సూపర్ బజార్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపం వద్ద వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి విశేష పూజలు, అలంకరణలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వాసవీ...