జనగామ కలెక్టరేట్‌లో వాసవీ మాత జయంతి

జనగామ కలెక్టరేట్‌లో వాసవీ మాత జయంతి కాకతీయ, జనగామ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం వాసవీ మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతిని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. మహనీయుల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా వారి...