ఐడీఓసీలో ఘనంగా వాసవీ మాత జయంతి

ఐడీఓసీలో ఘనంగా వాసవీ మాత జయంతి చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టరేట్ అధికారులు వాస‌వీ మాత‌ బోధనలు సమాజానికి ఆదర్శం : ఏఓ ప్రకాష్ కాకతీయ, పెద్దపల్లి : జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో ఆదివారం వాసవీ మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువజన, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి (ఏఓ) ప్రకాష్ పాల్గొని, వాసవీ మాత చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ ప్రకాష్ మాట్లాడుతూ.. వాసవీ మాత బోధనలు...