వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం

వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భారీగా తరలివచ్చిన భక్తులు.. అన్నప్రసాద వితరణ కాకతీయ, ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ఆరాధన మహోత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సందడితో నిండిపోయాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తుల కోసం భారీ ఎత్తున...