అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి మీడియా కమిటీ సభ్యులతో కలెక్టర్ గరిమ అగర్వాల్ నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం కాకతీయ, సిరిసిల్ల టౌన్: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నూతనంగా ఎన్నికైన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ల జారీ...