చెన్నారావుపేటలో బీఆర్‌ఎస్‌ ధర్నా

చెన్నారావుపేటలో బీఆర్‌ఎస్‌ ధర్నా మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం గోనె సంచుల కొరతతో అన్నదాతల ఇబ్బందులు కాకతీయ, చెన్నారావుపేట: మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, గోనె సంచుల కొరతను నిరసిస్తూ సోమవారం చెన్నారావుపేట మండల కేంద్రంలో రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 11న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా, నేటికీ కొనుగోలు ప్రక్రియ గాడిలో పడలేదని ధ్వజమెత్తారు. కేంద్రాల్లో కాంటా వేయడంలో జాప్యం...