మెడికవర్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
మెడికవర్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన వైద్యుడి నిర్లక్ష్యంతోనే ప్రాణం పోయిందంటూ నిరసన బెదిరింపులకు దిగిన భద్రతా సిబ్బంది? కాకతీయ, హనుమకొండ: వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ మనిషి ప్రాణం పోయిందని ఆరోపిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా పాకాల మండలం వెలిబెల్లి గ్రామానికి చెందిన బొజ్జ జంపయ్య కడుపునొప్పితో ఈ నెల 25న నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో...