నల్లబెల్లిలో గులాబీ పండగ
నల్లబెల్లిలో గులాబీ పండగ ఘనంగా బీఆర్‌ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామగ్రామాన రెపరెపలాడిన పార్టీ జెండాలు కాకతీయ, నల్లబెల్లి: తెలంగాణ అస్తిత్వ పోరాటానికి వేదికగా నిలిచిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం నల్లబెల్లి మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జెండా ఆవిష్కరణలు చేశారు. నల్లబెల్లి బస్టాండ్ ఆవరణలో మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా...