కరీంనగర్ ఘటనకు నిరసనగా బల్దియా ఉద్యోగుల ఆందోళన
కరీంనగర్ ఘటనకు నిరసనగా బల్దియా ఉద్యోగుల ఆందోళన నల్లబ్యాడ్జీలతో లంచ్ టైమ్‌లో నిరసన మాజీ డిప్యూటీ మేయర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ కాకతీయ, వరంగల్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళ రమేష్ ఎంహెచ్‌ఓను కలిసేందుకు...