జాతీయ రహదారిపై జర జాగ్రత్త!
జాతీయ రహదారిపై జర జాగ్రత్త! గూడెప్పాడ్ వద్ద రోడ్డుపై భారీ గుంతలు చీకటి పడితే ప్రయాణికుల విలవిల పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు కాకతీయ, ఆత్మకూరు: జాతీయ రహదారి (163)పై ప్రయాణం అంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. రహదారిపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. మంగళవారం ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై భారీ లోతుగా గుంత ఏర్పడటంతో హనుమకొండ నుండి ములుగు వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన జాతీయ రహదారి,...