కోర్టు వివాదంలో ఉన్న భూమి విక్రయంపై ఆవేదన
కోర్టు వివాదంలో ఉన్న భూమి విక్రయంపై ఆవేదన న్యాయం చేయాలని బాధితుడు లక్ష్మణ్ డిమాండ్ కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిని, తన అనుమతి లేకుండా అక్రమంగా విక్రయించారని బాధితుడు లకావత్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. లకావత్ తులిసియా కుటుంబానికి చెందిన భూమి వారసత్వంగా...