ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి నీరు, నీడ, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి పనులను పరిశీలించిన డీఆర్‌డీఓ నాగ పద్మజ కాకతీయ, గీసుగొండ: ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలకు పని ప్రదేశాల్లో ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స సౌకర్యాలను తప్పనిసరిగా కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కె. నాగ పద్మజ ఆదేశించారు. మంగళవారం మండలంలోని ఊకల్, నందనాయక్ తండా, కొమ్మాల, కొనాయిమాకుల గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను, నర్సరీలను ఆమె స్వయంగా పరిశీలించారు....