29న తాడికల్‌లో పూర్వ ప్రజాప్రతినిధులకు సన్మానం
29న తాడికల్‌లో పూర్వ ప్రజాప్రతినిధులకు సన్మానం గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైన వారికి గౌరవం సర్పంచ్ దుర్గపు సుజాత-తిరుపతి కాకతీయ, శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామంలో పూర్వ ప్రజాప్రతినిధుల సేవలను స్మరించుకుంటూ ఈనెల 29న (బుధవారం) ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ వేడుక జరగనుంది. గతంలో తాడికల్ గ్రామ ప్రజల చేత ఎన్నికై జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ మరియు సర్పంచ్‌లుగా బాధ్యతలు నిర్వహించి, గ్రామాభివృద్ధికి విశేష కృషి చేసిన వారిని ఈ సందర్భంగా...