మల్లెపూల అలంకరణలో సుబ్రహ్మణ్యేశ్వరుడు

మల్లెపూల అలంకరణలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఊకల్‌ హవేలీలో వైభవంగా విశేష పూజలు భారీగా తరలివచ్చిన భక్తులు కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం మల్లెపూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేసవి కాలాన్ని పురస్కరించుకుని స్వామివారికి చల్లదనం కోసం ఆలయ అర్చకులు ఈ ప్రత్యేక అలంకరణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. అనంతరం ఆలయాన్ని,...