సాగుపై రైతులకు శాస్త్రవేత్తల దిశానిర్దేశం
సాగుపై రైతులకు శాస్త్రవేత్తల దిశానిర్దేశం మొలంగూరులో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ ఆధునిక పద్ధతులు, భూసార పరీక్షలపై అవగాహన కాకతీయ, శంకరపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమం మంగళవారం మొలంగూరు గ్రామంలో రెండో రోజు కొనసాగింది. జిల్లావ్యాప్తంగా 64 గ్రామాల్లో మే 23 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల వ్యవసాయ కళాశాల...