హెల్త్‌ ఆఫీసర్‌ ఛాంబర్‌లో వీరంగం

హెల్త్‌ ఆఫీసర్‌ ఛాంబర్‌లో వీరంగం కార్యాలయ ఫర్నిచర్‌ ధ్వంసం.. సిబ్బందిపై దౌర్జన్యం డిప్యూటీ కమిషనర్‌కు ఉద్యోగ సంఘాల వినతి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కొందరు వ్యక్తులు హంగామా సృష్టించారు. విధుల్లో ఉన్న అధికారులను భయాందోళనకు గురిచేస్తూ, హెల్త్ ఆఫీసర్ ఛాంబర్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనను మున్సిపల్ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సమాచారం ప్రకారం.. అంతిమయాత్ర వాహనం కేటాయింపు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే...