బెల్లి లలితక్క ఆశయాలు యువతకు ఆదర్శం
బెల్లి లలితక్క ఆశయాలు యువతకు ఆదర్శం నివాళులర్పించిన సర్పంచ్ మాదరి ప్రశాంత్ కాకతీయ, నెల్లికుదురు : తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు, గానకోకిల బెల్లి లలితక్క పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శమని శ్రీరామగిరి సర్పంచ్ మాదరి ప్రశాంత్ కొనియాడారు. బుధవారం మండలంలోని శ్రీరామగిరి గ్రామపంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో బెల్లి లలితక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్య పరిచిన లలితక్క ఆశయాలను సమాజం...