పంట మార్పిడితోనే నేల ఆరోగ్యం పదిలం
పంట మార్పిడితోనే నేల ఆరోగ్యం పదిలం అవసరానికి మించి ఎరువులు వాడొద్దు రైతులకు శాస్త్రవేత్తల హితబోధ కన్నారావుపేటలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కాకతీయ, నల్లబెల్లి: సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవడానికి రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని శాస్త్రవేత్తలు సూచించారు. నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామ రైతు వేదిక వద్ద బుధవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. అధిక మొత్తంలో యూరియా వాడటం వల్ల నేల, నీరు, వాతావరణం...