అగ్నికి ఆహుతి.. ప్రకృతి వనం ఖాళీ

అగ్నికి ఆహుతి.. ప్రకృతి వనం ఖాళీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తుల ఆరోపణ ఇందుర్తిలో ప్రకృతి సంపద నాశనం కాకతీయ, చిగురుమామిడి: చిగురుమామిడి మండల పరిధిలోని ఇందుర్తి గ్రామ ప్రకృతి వనంలో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల విలువైన ప్రకృతి సంపద అగ్నికి ఆహుతైందని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనాల్లో పెరిగిన ఎండు గడ్డిని సమయానుకూలంగా తొలగించకపోవడం, మొక్కలకు తగినంత నీటి సౌకర్యం కల్పించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు....