వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం

వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం వైశాఖ పౌర్ణమి వేళ భక్తిజన సందోహం ఆధ్యాత్మిక తరంగంలో పానికర గ్రామం కాకతీయ , నెక్కొండ : మండలంలోని పానికర గ్రామంలో వెలసిన ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ పౌర్ణమి వేడుకలు అంబరాన్నంటాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో పానికర గుట్ట భక్తజన సందోహంగా మారింది. వేద మంత్రోచ్ఛారణలు,...