రాజ్యాంగ సాక్షిగా.. ఒక్కటైన ఇంజినీరింగ్ జంట!

రాజ్యాంగ సాక్షిగా.. ఒక్కటైన ఇంజినీరింగ్ జంట! మణుగూరులో ఆదర్శ వివాహం అంబేద్కర్, బుద్ధుని సాక్షిగా ప్రమాణం కాకతీయ,మణుగూరు : నేటి ఆధునిక కాలంలో ఆడంబరాలకు పోకుండా, వినూత్నంగా ఆలోచించి అంబేద్కర్ ఆశయ సాధనలో ఒక ఇంజినీరింగ్ జంట ఆదర్శంగా నిలిచింది. మణుగూరుకు చెందిన పూరేటి యాకోబు, సువర్ణ దంపతుల కుమారుడు రాజ్ కిరణ్, సామికలు శుక్రవారం రాజ్యాంగంపై ప్రమాణం చేసి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సింగరేణి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు సత్తుపల్లికి చెందిన డాక్టర్ కొచ్చర్ల శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మయ్య...