కమనీయం.. రమణీయం.. వేంకటేశ్వర కల్యాణం
కమనీయం.. రమణీయం.. వేంకటేశ్వర కల్యాణం ముత్యాల తలంబ్రాలతో వైభవంగా వేడుకలు గోవింద నామస్మరణతో మార్మోగిన సుందరగిరి కాకతీయ,చిగురుమామిడి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన సుందరగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చక బృందం శాస్త్రోక్తంగా వేడుకలను నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో పుణ్యాహవాచనం, అంకురారోహణం, రక్షాబంధనం, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలు నిర్వహించగా, మధ్యాహ్నం స్వామివారి ఎదుర్కోళ్ల మహోత్సవం కనులపండువగా సాగింది. ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో, శేషం...