ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కాకతీయ, శంకరపట్నం: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ (హుజూరాబాద్) ఆధ్వర్యంలో శనివారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గ్రామంలోని పెద్ద చెరువులో మట్టి తొలగింపు పనుల్లో నిమగ్నమైన సుమారు 80 మంది కూలీలకు సర్పంచ్ దుర్గపు సుజాత-తిరుపతి చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ.. ఎండ తీవ్రత అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఉపాధి పనులకు...