నాణ్యమైన విత్తనాలతోనే రైతుకు భరోసా

నాణ్యమైన విత్తనాలతోనే రైతుకు భరోసా లైసెన్స్ ఉన్న కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి కాకతీయ, కరీంనగర్: రాబోయే వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులు నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాలనే సాగుకు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి జె. భాగ్యలక్ష్మి సూచించారు. కొత్తపల్లి రైతు వేదికలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైన మేరకే...