ఆర్టీసీ డిపోల్లో మే డే సంబరాలు

ఆర్టీసీ డిపోల్లో మే డే సంబరాలు పీఆర్సీ పెంపు, ఎన్నికల నిర్వహణపై హర్షాతిరేకాలు సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకం కాకతీయ, కరీంనగర్ : ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టాండ్ పరిధిలోని ఆర్టీసీ డిపో-1, 2లలో మే డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్మికుల చిరకాల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ వేడుకలను పండుగలా నిర్వహించారు. డిపో-1లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్ పాల్గొని కార్మికులతో...