వల్లబ్‌నగర్‌లో వైభవంగా శివలింగ ప్రాణ ప్రతిష్ఠ

వల్లబ్‌నగర్‌లో వైభవంగా శివలింగ ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఐదు రోజులుగా కొనసాగుతున్న మహాదేవ ఉత్సవాలు కాకతీయ, నర్సంపేట టౌన్:- నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వల్లబ్‌నగర్‌లో శ్రీశ్రీశ్రీ మహాదేవ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రధాన ఘట్టమైన శివలింగ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ వేడుకకు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ అభివృద్ధి కమిటీ...