ఇందిరమ్మ ఇళ్లకు రాజకీయ రంగులా?

ఇందిరమ్మ ఇళ్లకు రాజకీయ రంగులా? కేంద్ర నిధులతో నిర్మించే ఇళ్లపై కాంగ్రెస్ రంగులేంటి? బిల్లుల పేరుతో లబ్ధిదారులను భయపెట్టడం సరికాదు బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవి విమ‌ర్శ‌ కాకతీయ, గీసుగొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాజకీయ రంగులు పులమడం సరికాదని బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవి విమర్శించారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్మితమవుతున్న ఇళ్లకు కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా ధనంతో నిర్మించే ఇళ్లను రాజకీయ ప్రచార సాధనాలుగా మార్చడం...