మక్కల తరలింపులో వివక్ష.. రైతుల ఆగ్రహం

మక్కల తరలింపులో వివక్ష.. రైతుల ఆగ్రహం పది రోజులుగా సొసైటీ వద్దే నిరీక్షణ దళారులకే ప్రాధాన్యమంటూ నిరసన కాకతీయ, నల్లబెల్లి:"పండించిన వాడు ఎండలో ఎండుతున్నాడు.. దళారుల మక్కలు మాత్రం గోదాములు నిండుతున్నాయి" అంటూ నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతులు గళమెత్తారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలని డిమాండ్ చేస్తూ శనివారం నల్లబెల్లి సొసైటీ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. గత పది రోజులుగా పంటను ఇక్కడే కుప్పలుగా పోసి కాపలా కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని...