జమ్మికుంట కోఆప్షన్ ఎన్నిక వాయిదా
జమ్మికుంట కోఆప్షన్ ఎన్నిక వాయిదా అభ్యర్థుల సంఖ్య పెరగడంతో నిర్ణయం పారదర్శకతకే ప్రాధాన్యం : ఛైర్మన్ ప్రశాంత్ కుమార్ కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీలో శనివారం జరగాల్సిన కోఆప్షన్ సభ్యుల ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడింది. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కోఆప్షన్ పదవుల కోసం ఆశావహుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం...