లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం సింగపురంలో సమీపంలో విషాదం మృతుడు జూపాక వాసిగా గుర్తింపు కాకతీయ, హుజురాబాద్: హుజూరాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని మండలంలోని జూపాక గ్రామానికి చెందిన కేతిరి విక్రమ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి...