రేపు కూసుమంచిలో ‘ప్రజా దర్బార్’..
రేపు కూసుమంచిలో 'ప్రజా దర్బార్'.. ప్రజల చెంతకే యంత్రాంగం - వేదికపైనే పరిష్కారం కాకతీయ, కూసుమంచి: పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే చేర్చే లక్ష్యంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రేపు (ఆదివారం) కూసుమంచి క్లస్టర్ పరిధిలో భారీ 'ప్రజా దర్బార్' నిర్వహించనున్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 08:00 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సమస్యల పరిష్కారమే లక్ష్యం...