డంపింగ్ యార్డుతో నగర ప్రజల నరకయాతన
డంపింగ్ యార్డుతో నగర ప్రజల నరకయాతన పొగతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా పట్టదా..? టెండర్లు తెరవడానికి చేతులకు రోగం పుట్టిందా? అధికారుల తీరుపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ ధ్వజం ప్రశ్నిస్తే కార్పొరేటర్లపై కేసులు పెడుతున్నారంటూ ఆరోపణలు కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని డంపింగ్ యార్డ్ సమస్యతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుందని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. శనివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో...