కరీంనగర్ వాసులకు తిరుపతి రైలు ముచ్చట!
కరీంనగర్ వాసులకు తిరుపతి రైలు ముచ్చట! మే 9 నుంచి క్రమబద్ధంగా నాందేడ్–తిరుచానూర్ సేవలు రద్దీ నివారణకు అదనపు బోగీలు.. భక్తులకు ఊరట కాకతీయ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ఇప్పటివరకు ప్రత్యేక వారాంతపు రైలుగా నడుస్తున్న నాందేడ్–తిరుచానూర్ (17633) రైలును మే 9వ తేదీ నుంచి క్రమబద్ధీకరిస్తున్నట్లు (Regular Service) ప్రకటించింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులు, ముఖ్యంగా ఏడుకొండల వాడి దర్శనానికి...