వైభవంగా వేణుగోపాల స్వామి రథోత్సవం
వైభవంగా వేణుగోపాల స్వామి రథోత్సవం కనులపండువగా స్వామివారి గరుడ సేవ భారీగా తరలివచ్చిన భక్తులు.. మొక్కుల సమర్పణ కాకతీయ, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. గ్రామంలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రథోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. గత సోమవారం స్వామివారి కళ్యాణోత్సవంతో ప్రారంభమైన వేడుకలు.. శనివారం నిర్వహించిన గరుడ సేవతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు మంగళహారతులు...