ఎల్లమ్మ సన్నిధిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ఎల్లమ్మ సన్నిధిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇందుర్తి అమ్మవారికి శివకుమార్ దంపతుల ప్రత్యేక పూజలు ఘనంగా సన్మానించిన గ్రామస్థులు, ఆలయ కమిటీ కాకతీయ, చిగురుమామిడి: మండలంలోని ఇందుర్తి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, ప్రణీత దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు, గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో న్యాయమూర్తి దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు,...