భూసార పరీక్షలతోనే మేలైన సాగు

భూసార పరీక్షలతోనే మేలైన సాగు ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు వహించాలి రైతు వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కాకతీయ, గీసుగొండ: రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకుని, ఆ నివేదికల ఆధారంగానే ఎరువులను వినియోగించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. అప్పుడే అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు ఖర్చును తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆమె ముఖ్య...