బాధితులకు కాంగ్రెస్ నేతల పరామర్శ
బాధితులకు కాంగ్రెస్ నేతల పరామర్శ జ్యూవెల్లరీ షోరూంను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, కరీంనగర్: నగరంలోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన సంచలన దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. సోమవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. షోరూం సిబ్బందిని, పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం...