ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు..

ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు.. బిక్కాజిపల్లిలో జనం బెంబేలు! నివాసాల మధ్య వేలాడుతున్నా ప‌ట్టించుకోని అధికారులు కాకతీయ, దుగ్గొండి: మండలంలోని బిక్కాజిపల్లి గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. జనావాసాల మధ్య విద్యుత్ వైర్లు అత్యంత ప్రమాదకరంగా కిందికి వేలాడుతుండటంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ వైరు తెగి పడుతుందో, ఎవరి ప్రాణం పోతుందోనని స్థానికులు కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామంలోని నివాస ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. ముఖ్యంగా వీధుల్లో...