నాగులవంచలో రైతుల భారీ రాస్తారోకో
నాగులవంచలో రైతుల భారీ రాస్తారోకో రెండు గంటల పాటు నిలిచిన వాహనాలు అదనపు కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ కాకతీయ, చింతకాని: మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ మండలంలోని నాగులవంచలో రైతులు సోమవారం భారీ రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ఆందోళనతో రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సీపీఎం నేతలు నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వర్లు మరియు బీఆర్ఎస్ నాయకులు మంకెన రమేష్, గురజాల హనుమంతరావుల ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా...