చేతికొచ్చిన పంట బుగ్గి..
చేతికొచ్చిన పంట బుగ్గి.. కన్నీరుమున్నీరవుతున్న రైతు కాకతీయ, బోనకల్: మండల పరిధిలోని గోవిందపురం (ఎల్) గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఓ రైతు ఆశలు అడియాశలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించి, కుప్పగా పోసిన మొక్కజొన్న పంట నిప్పు రవ్వల ధాటికి పూర్తిగా బూడిదైంది. కళ్లముందే పంట దహనమవడంతో బాధితుడు ఎర్రబోయిన నాగేశ్వరరావు పొలంలోనే కుప్పకూలిపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బాధితుడి పొలం పక్కనే ఉన్న మరో రైతు తన పొలంలోని మొక్కజొన్న దంటును తగలబెట్టేందుకు నిప్పు పెట్టారు. అదే సమయంలో గాలి దుమారం...