ఏడ్చిన నేల.. దగ్ధమైన ఆశలు!
ఏడ్చిన నేల.. దగ్ధమైన ఆశలు! కొనయిపల్లిలో భారీ అగ్నిప్రమాదం మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి.. లక్షల్లో నష్టం ఆదుకోవాలని బాధితుల ఆవేదన కాకతీయ, వేములవాడ: వేములవాడ పట్టణ పరిధిలోని కొనయిపల్లిలో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదం అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతులు గుండె కోతకు గురయ్యారు. ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే ఎకరాల మేర వ్యాపించి బీభత్సం సృష్టించాయి. గ్రామ సమీపంలోని మొక్కజొన్న పొలాల్లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. పంట పూర్తిగా...