మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు బేఖాతరు!

మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు బేఖాతరు! వికలాంగ బాలికకు అందని న్యాయం నాలుగేళ్లు గడిచినా అమలుకాని వైనం అధికారుల నిర్లక్ష్యంపై తండ్రి ఆవేదన కాకతీయ, కరీంనగర్: బాధితులకు బాసటగా నిలవాల్సిన మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. తన వికలాంగ కుమార్తెకు న్యాయం చేయాలని కమిషన్ ఆదేశించి నాలుగేళ్లు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడకపోవడంపై బాధితురాలి తండ్రి షేక్ మునవర్ పాషా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ అహ్మద్‌పూర్‌కు చెందిన మునవర్ పాషా పెద్ద కుమార్తె అతిఫా మెహరీన్ పుట్టుకతోనే...