ఉపా కేసులో బద్రి, రాజేందర్‌లకు విముక్తి
ఉపా కేసులో బద్రి, రాజేందర్‌లకు విముక్తి నిర్దోషులుగా ప్రకటించిన హనుమకొండ జిల్లా సెషన్స్ కోర్టు సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టివేత కాకతీయ, హనుమకొండ: కంచెర్ల బద్రి, దామెర రాజేందర్‌లపై నమోదైన ఉపా కేసును హనుమకొండ జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసి, వారిద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపించడంలో విఫలమవడంతో ఆరోపణలు నిలబడవని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో పోలీసులు వీరిద్దరిపై మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారంటూ కేసు నమోదు చేశారు. అయితే, నిందితుల వద్ద లభించిందని పోలీసులు...