సింగిల్ విండో చైర్మన్‌గా కొండల్ రెడ్డి బాధ్యతలు
సింగిల్ విండో చైర్మన్‌గా కొండల్ రెడ్డి బాధ్యతలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారుల చర్యలు కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ సింగిల్ విండో సహకార బ్యాంకు చైర్మన్‌గా ఎడవల్లి కొండల్ రెడ్డి తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత పాలకవర్గమే తిరిగి బాధ్యతలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సింగిల్ విండో కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కొండల్ రెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగా, వైస్ చైర్మన్‌గా ముద్రబోయిన శంకర్ పదవీ స్వీకారం చేశారు....