ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి

ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి చర్ల మండలంలో కలెక్టర్ అంకిత్ విస్తృత పర్యటన కాకతీయ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సత్యనారాయణపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో పాటు చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులతో సమీక్షించారు. సత్యనారాయణపురం గ్రామంలోని పెద్దపల్లి–ముమ్మిడివరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...