ఘనంగా రాయల జ‌న్మ‌దిన వేడుక‌లు

ఘనంగా రాయల జ‌న్మ‌దిన వేడుక‌లు కాకతీయ, కూసుమంచి: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (వేర్‌హౌసింగ్ కార్పొరేషన్) చైర్మన్ రాయల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను మంగళవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా.. మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెనుపూసల సీతారాములు, తెలంగాణ...