లింగంపల్లి శేఖర్ మృతిపై వెలిచాల సంతాపం

లింగంపల్లి శేఖర్ మృతిపై వెలిచాల సంతాపం కాకతీయ, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లింగంపల్లి శేఖర్ మృతి చెందడం పట్ల కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన శేఖర్ కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన నివాసంలో రాజేందర్ రావు పరామర్శించారు. తొలుత శేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆయన మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు....