నిలిచిన మొక్కజొన్న దిగుమతులు

నిలిచిన మొక్కజొన్న దిగుమతులు నల్లబెల్లి మండలంలో రైతుల‌ రాస్తారోకో కాకతీయ, నల్లబెల్లి: హమాలీలకు బకాయిలు చెల్లించకపోవడంతో గోదాముల వద్ద మొక్కజొన్న దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పంటను విక్రయించలేక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గన్నీ సంచులు, హమాలీలు, వాహన ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా, క్షేత్రస్థాయిలో మాత్రం లంచాల రాజ్యమే నడుస్తోందని రైతులు ఆరోపించారు. పీఏసీఎస్ (PACS) సిబ్బందితో దళారీలు కుమ్మక్కై క్వింటాలుకు కేవలం రూ.1600 నుండి రూ.1800లకే కొనుగోలు చేస్తూ...