గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి కేంద్రానికి ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి కాకతీయ, కరీంనగర్ : గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్–ఈద్గా–కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రైతులు వ్యవసాయంలో పనికిరాని స్థితికి చేరిన ఆవులను మార్కెట్‌కు తీసుకువస్తున్నప్పటికీ, వాటి కొనుగోలులో అనేక ఇబ్బందులు...