ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ కాకతీయ,శంకరపట్నం : రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ధాన్యం తూకం వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు. పది రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో అకాల వర్షాల భయంతో రైతులు ప్రాణాలు అరచేతిలో...